వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ :
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయం అందించడానికి జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అధికారులు, సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే తెలిపారు. వరంగల్ నగర వాసులు 1800 425 1980 ప్రత్యేక టోల్ ఫ్రీ, 9701999645 మొబైల్, 9701999676 వాట్స్ అప్ నంబర్ లను సద్వినియోగించుకొని సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమస్యలకు సంబంధించిన ఫోటో లను వాట్సాప్ నకు పంపి, ఆ ప్రాంతం ఏ డివిజన్ లోని ప్రాంతంలో ఉందొ కూడా తెలియజేస్తే బల్దియా డి.ఆర్.ఎఫ్.సిబ్బంది, అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు.