వేద న్యూస్, డెస్క్ :
ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే.. లంచం ఇవ్వకుండా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్ కోరారు.కాగా ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు లంచం ఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనే పోస్టర్స్ రూపొందించి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.ప్రతి ఒక్కరూ లంచం ఇవ్వకుండా అవినీతిని నిర్మూలించాలని ఈ సందర్భంగా (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్ కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.లేదా dgacb@telangana.gov.inకి మెయిల్ సైతం చెయ్యొచ్చని తెలిపారు.