వేద న్యూస్, వరంగల్ : 

యూనివర్సల్ 369 షోటో కాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా గోవా ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ కరాటే పోటీలు రెండు రోజులపాటు ఘనంగా అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా సినీ హీరో సుమన్ తల్వార్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ పోటీలలో నేపాల్, కువైట్ ,సౌత్ ఆఫ్రికా, జపాన్, శ్రీలంక బాంగ్లాదేశ్ ,కెనడా, ఇరాక్, ఫ్రాన్స్ ,ఇండోనేషియా, యుగాండా యూఏఈ తదితర సుమారు 16 దేశాల నుండి 3,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు . ఈ పోటీలలో వరంగల్ బిఎంఆర్ అకాడమీ విద్యార్థి “ఎండి ఇర్ఫాన్” కుమిటి విభాగంలో బంగారు పతకం వ్యక్తిగత కటా పోటీలో సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు. గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించిన ఇర్ఫాన్ కు అకాడమీ ప్రెసిడెంట్ బండారి సంతోష్, కార్యదర్శి కర్ర వెంకటేష్ కుంగ్ ఫు మార్షల్ ఆర్ట్స్ ఫౌండర్ గ్రాండ్ మాస్టర్ సదానందం, గోల్డెన్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్ సుజాత, ప్రిన్సిపాల్ మాధవి, సిబ్బంది అభినందనలు తెలిపారు.ఎండి ఇర్ఫాన్ బంగారు పతకం సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.