వేద న్యూస్, కాటారం :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించి స్వీట్ పంపిణి చేసారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆ కాంక్షలు నెరవేర్చింది కాంగ్రెస్ అగ్రనేత సోనియమ్మ అని కొనియాడారు. సోనియమ్మ తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిషకృతమైనది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాపు,రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రవెల్లి విలాస్ రావ్, పిఏసిఎస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు చల్ల తిరుపతి రెడ్డి,ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్,పార్టీ ఉపాధ్యక్షులు కోట సమ్మయ్య,మండల ప్రధాన కార్యదర్శి అయిత తిరుపతి రెడ్డి,కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ పద్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వామన్ రావు, కూరతోట కృష్ణమూర్తి ,సమ్మయ్య గడ్డం స్వామి, మల్లయ్య, ప్రదీప్ ,గట్టయ్య, ధర్మయ్య ,బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకటరమణ, రమేష్, శేఖర్, ఎనక పెళ్లి మాజీ సర్పంచ్ రవిచందర్ రెడ్డి , గణేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.