వేద న్యూస్, మొగుళ్ళపల్లి : 

మండలాన్ని ఆరోగ్యవంతమైనదిగా తీర్చిదిద్దడమే మనమందరం కర్తవ్యంగా భావించి ప్రజలకు ఆరోగ్య సేవలను అందించాలని మొగుళ్ళపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రానున్న వర్షాకాలం సీజన్ లో ప్రజలు విష జ్వరాల బారీన పడే ప్రమాదం ఉన్నందున..తక్షణమే వైద్య సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అలాగే ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.