వేద న్యూస్, మొగుళ్లపల్లి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులను నిర్వహిస్తున్న గుండేటి సుధాకర్ చేసిన ఉత్తమ సేవలకు గాను ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా..తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ ఉన్నతాధికారులు ఆయనను ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా నియమితులైన గుండేటి సుధాకర్ వృత్తి నిర్వహణలో తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ..మండలంలో క్రైమ్ రేట్ పెరగకుండా..ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ముందుంటూ..ఫ్రెండ్లీ పోలీస్ అనే పోలీస్ ఉన్నతాధికారుల ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ..పేరు ప్రఖ్యాతులు గడించిన గుండేటి సుధాకర్ ప్రజలకు మరింత చేరువై..ఇలాంటి పురస్కారాలు మరెన్నో పొందాలని తోటి ఉద్యోగులు ఆకాంక్షించారు. అలాగే ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా ఎంపికైన గుండేటి సుధాకర్ కు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, తోటి సిబ్బంది అభినందనలను వెలిబుచ్చారు.