- ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి
వేద న్యూస్ , చెన్నూరు:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో సోమవారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 32మందికి అర్హులైన కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలుచేస్తుంది అని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తాం అన్నారు.
ప్రభుత్వ పథకాల్లో అర్హులైన నిరుపేదలకు పథకాలు అందేలా చూస్తామని ఎలక్షన్ కోడ్ లో తన పై కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రజల కోసమే ఏర్పడిన ప్రభుత్వం అని అన్నారు.