వేద న్యూస్, జమ్మికుంట:

భారతీయ జనతా పార్టీ(బీ జే పీ) జమ్మికుంట మండల శాఖ అధ్యక్షుడు దివంగత పి . రవీందర్ రావు  27వ వర్ధంతిని జమ్మికుంట పట్టణంలోని కోరపల్లి రోడ్ { కేశవపురం బైపాస్ రోడ్డు లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

         జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు లు మాట్లాడుతూ రవీందర్రావు చిన్నప్పటినుండి సంఘ పరివార్ క్షేత్రాలలో పనిచేస్తూ జమ్మికుంట మండలం పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తూ,మండల అధ్యక్షుడిగా బిజెపి పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేస్తూ.. నరాంతక నక్సలైట్లు చేతిలో ప్రాణాలు విడిచిన మహనీయుడని వారి సేవలను ఉద్దేశించి కొనియాడారు.

        కార్యక్రమంలో నాయకులు అప్పం మధు యాదవ్, కైలాసకోటి గణేష్, అప్పల రవీందర్, యమసాని సమ్మయ్య , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.