వేద న్యూస్, జమ్మికుంట:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో శనివారం ఫ్యాకల్టీ ఫోరం ఆధ్వర్యంలో సామాజిక శాస్త్రాల జ్ఞానశాస్త్రం(Epistemology of social sciences) అనే అంశంపై డాక్టర్ ఏ. మధుసూదన్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హనుమకొండ వారు విచ్చేసి ప్రసంగించారు.
జ్ఞానం, పుట్టుక, స్వభావం పరిమితులు వాస్తవాలు విలువలకు మధ్య ఉండే వైరుధ్యాలు.. అలాగే సామాజిక శాస్త్రాల పాత్ర మొదలగు అంశాలపై మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం.. ఫ్రెంచ్ విప్లవం ద్వారా సమాజానికి పరిచయం అయ్యాయని అన్నారు.
సామాజిక శాస్త్రాలు విలువలకు ప్రాధాన్యం ఇస్తే సైన్స్ వాస్తవాలకు ప్రాధాన్యత ఇస్తుందని వారన్నారు. ఇవి ఎప్పుడు మారుతూ ఉంటాయని , అందుకే సామాజిక శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. అనంతరం వ్యక్తుల్ని వారి జ్ఞానాన్ని సరుకుగా మార్చడం వెనుక ఉన్న రాజకీయ శక్తులు వాటి పరిణామాలపై చర్చ జరిగింది. ఈ సమావేశాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజశేఖర్ సామాజిక శాస్త్రాల ప్రాధాన్యత వివరిస్తూ ప్రారంభించారు.
ఎ .శ్రీనివాస్ రెడ్డి .. వక్త మధుసూదన్ రెడ్డి ని సభకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ రామమోహన్ రావు, అధ్యాపకులు బి.మహేందర్ రావు, డాక్టర్ టి.శ్రీలత, పి.డి. సుజాత, ఆర్. ఈశ్వరయ్య డాక్టర్ వి. స్వరూప రాణి, పి.శ్రీనివాస్ రెడ్డి ఎల్ రవీందర్, డాక్టర్ రవి ప్రకాష్ ,డాక్టర్ సుష్మ, సాయి, ప్రశాంత్ ,అరుణ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తిరుపతి, రఘు, ప్రశాంతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.