• ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ కు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వినతి

వేద న్యూస్, ఆసిఫాబాద్:

కొమరం అసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్, ఆసిఫాబాద్ మాజీ జడ్పీటీసీ అరిగేల నాగేశ్వర రావు తో కలిసి ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ గోడం నగేష్ కు వినతి పత్రం అందజేసారు. 

ఈ సందర్బంగా ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ మన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఉన్నత విద్య విషయంలో చాలా వెనుకబడి ఉందని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఆ పై చదువులకి ఏ ఒక్క ఉన్నత విధ్యా సంస్థ కూడా లేదని, అదే విధంగా జిల్లాలో చాలా వరకు వ్యవసాయం పై ఆధారపడే కుటుంబాలే ఎక్కువ వారి పిల్లలు చదువుకుంటూ కూడా వ్యవసాయం పై ఆసక్తి చూపిస్తారని వెల్లడించారు.

జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంటే ఇక్కడ విద్యార్థులకు వ్యవసాయం పై పూర్తి అవగాహన ఉన్నందువల్ల వాళ్ళు వ్యవసాయం విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివి వ్యవసాయం లో సాంకేతిక అదునాతన పద్ధతులని నేర్చుకొని ఇక్కడి రైతులకి కొంత వరకు మేలు చేసే అవకాశం ఉందని వివరించారు.  ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు అవసరం ఉన్నది కాబట్టి ఎంపీ జిల్లా లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం చొరవ తీస్కొని కృషి  చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు గజ్జల లక్ష్మణ్, యువ నాయకులు బొట్టుపల్లి సాయి కృష్ణ సామజిక కార్యకర్త కల్లూరి ప్రశాంత్, టొమ్రే శ్రీకాంత్ తదితరులు ఉన్నారు