వేద న్యూస్, ఇల్లందకుంట:

హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఐత ప్రకాష్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో ఆదివారం ఇల్లందకుంట మండల కాంగ్రెస్ నాయకుడు ఇంగిలే రామారావు  కలిశారు. లీడర్లతో కలిసి మర్యాదపూర్వకంగా ప్రకాష్ రెడ్డిని కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఫిష‌ర్‌మెన్ చైర్మన్ బండి మల్లేష్, హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.