వేద న్యూస్, హన్మకొండ:
మండలకేంద్రంలో సొంత భవనం లేక గత కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగు తున్న గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఒక భవనంలోకి మార్చినట్టు పంచాయతీ కార్యదర్శి ఇంజపల్లి నరేష్ తెలిపారు.
గ్రామపంచా యతీ కార్యాలయానికి నూతన భవనం నిర్మించే వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన భవనం లోనే జీపీ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. గ్రామ ప్రజలు గమనించి సహ కరించాలని కోరారు.