- సంజీవని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు
- జ్వరమును నిర్లక్ష్యం చేయొద్దు
- జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్
- ఆస్తమా పేషెంట్స్ బీ కేర్ ఫుల్
- చాతి వైద్య నిపుణులు డాక్టర్ కిశోర్ కుమార్
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రస్తుత వానాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు సూచించారు. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలను వైద్యులు గురువారం తెలిపారు.
ప్రతి ఒక్కరూ రుతుపవనాలకు మాత్రమే స్వాగతం చెప్పాలని రోగాలకు కాదని జమ్మికుంట సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు గోల్డ్ మెడలిస్ట్, జనరల్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ &క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్ తెలిపారు. చికెన్ గున్యా, డెంగ్యూ, వైరల్ ఫీవర్, మలేరియా, కలరా, టైఫాయిడ్ జ్వరం, సాధారణ జలుబు, కడుపు నొప్పి, ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. ముఖ్యంగా జ్వరమును నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. వెంటనే డాక్టర్‌ను వైద్య సలహాలకు సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవాలని పేర్కొన్నారు.
చికెన్ గున్యా లక్షణాలు
తలనొప్పి, కండరాల నొప్పితో పాటు అలసట, కీళ్ల వాపు, వాంతులు, వికారం, అతి సారం (నీళ్ల విరేచనాలు) వంటివి చికెన్ గున్యా లక్షాలని వివరించారు. చికెన్ గున్యా జ్వరం అనేది చికెన్ గున్యా వైరస్ వల్ల సోకుతుందని డాక్టర్ సురేశ్ ఊడుగుల చెప్పారు. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవి కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.
వైరల్ జ్వరం లక్షణాలివే
జ్వరంగా ఉండి కళ్లు మంటగా అనిపించడం, గొంతులో మంట, వాంతులు, నీళ్ల విరోచనాలు, రుచి తెలియకపోవడం, దగ్గు, చెవుల నొప్పితో పాటు తల నొప్పి, కడుపు నొప్పి, నీరసం, బాడీ పెయిన్స్, మోకాళ్ల నొప్పులు వైరల్ ఫీవర్ లక్షణాలు. కాగా, ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ సురేశ్ ఊడుగుల సూచించారు.
ఆస్తమా పేషెంట్స్ బీ కేర్ ఫుల్
వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ చాతివైద్య నిపుణులు డాక్టర్ కిశోర్ కుమార్ కామిశెట్టి సూచించారు.
ఆస్తమా లక్షణాలు
జలుబుతో మొదలయి తరుచూ వచ్చిపోయే దగ్గు, ఈ దగ్గు రాత్రిళ్లు తీవ్రంగా ఉంటుంది. తరుచుగా నిద్రాభంగం కలుగుతుంది. దగ్గుతో పాటు వచ్చే వీజింగ్ (మీ చాతి నుండి వెలువడే ఈల వంటి ధ్వని) వస్తుంటుంది. యాంటి బయోటిక్స్, మామూలు దగ్గు మందులతో ఈ వ్యాధి నయం కాదు. ఊపిరిలో వేగం, చాతీలో బరువుగా ఉండటం., వ్యాయామం (ఆటలు) తర్వాత ఊపిరి పీల్చేటపుడు, దగ్గేటప్పుడు ఇబ్బంది కలగవచ్చు. అయితే, అందరికీ ఈ లక్షణాలు ఉండాలనేమీ లేదు. కొందరికి ఒకట్రెండు లక్షణాలే కనబడుతుండొచ్చు. కొందరికివి తరచుగా వస్తూ పోతుండొచ్చు. కొందరికి ఎప్పుడూ వేధిస్తుండొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ కిశోర్ కుమార్ సూచించారు.
ఆస్తమా సమస్యపై వివరించిన డాక్టర్ కామిశెట్టి కిశోర్
ఆస్తమా అనేది దీర్ఘకాల శ్వాసకోశ నాళాలకు సంబంధించిన సమస్యని సంజీవని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, చాతి వైద్య నిపుణులు కిశోర్ కుమార్ కామిశెట్టి తెలిపారు. అస్తమా (ఉబ్బసం) అన్నది పిల్లలలోను, పెద్దలలోను కూడా కలిగే ఒక సాధారణమైన జబ్బు అని స్పష్టం చేశారు. ఈ జబ్బు తాకిడి కలిగినప్పుడు ఉన్నట్టుండి.. ఆప్రయత్నంగా శ్వాసనాళాలు కొంత సేపు బిగుసుకుపోవడం జరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వివరించారు.
ఆస్తమా కారణంగా గుండెకు కానీ, ఊపిరితిత్తులకు కాని శాశ్వతమైన హాని జరగదని వెల్లడించారు. ఆస్తమా అంటు వ్యాధి కాదని,. ఇది ఇతర రోగుల నుండి అంటుకోదని వెల్లడించారు. అయితే, ఇది వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరికి ఉబ్బసం ఉంటే మిగతా వాళ్లకు కూడా అది వచ్చి తీరాలని ఏమి లేదని కూడా తెలిపారు. తల్లిదండ్రులిద్దరికీ ఆస్తమా ఉంటే, వారి పిల్లలకు 70% వరకు రావచ్చని, ఇద్దరిలో ఎవరో ఒకరు ఆస్తమా బాధితులైతే పిల్లలకు 30% వరకు రావచ్చని చెప్పారు.
24/7 అవేలబుల్..ఫుల్ టైం పల్మనాలజిస్ట్..డాక్టర్ కిశోర్
ఆస్తమా నిర్లక్ష్యం చేయకూడని జబ్బు అని, ఆస్తమా గురించి తెలుసుకుంటే నివారించగమని వెల్లడించారు. ఆస్తమా నిర్ధారణకు పరీక్షలుంటాయని, అవి చేయించుకున్న తర్వాత వైద్యుల సూచన మేరకు ట్రీట్‌మెంట్ తీసుకోవాలని స్పష్టం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలో చాతి వైద్యానికి 24/7 అందుబాటులో ఉన్న ఏకైక ఆస్పత్రి సంజీవని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి మాత్రమే కాగా, ఎంబీబీఎస్ ఎండీ పల్మనాలజీ, చాతి వైద్య నిపుణులు డాక్టర్ కిశోర్ కుమార్ కామిశెట్టి ఆస్తమా వైద్యులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. పలు ప్రతిష్టాత్మక ఆస్పత్రులలో పని చేసిన కిశోర్ ఫుల్ టైం పల్మనాలజిస్ట్ గా సంజీవని ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నారు. కరోనా తర్వాత వచ్చే ఇబ్బందులకూ డాక్టర్ కిశోర్ ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.