వేద న్యూస్, వరం గల్:
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం 29వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ సమక్షంలో డిస్ట్రిక్ట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పెరుమాండ్ల రామకృష్ణ , ఆ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ తదితర నాయకులు, కార్యకర్తల సమక్షంలో 29వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బుర్ర శ్రవణ్ కుమార్ కు గురువారం నియామకపత్రం అందజేశారు
ఈ సందర్బంగా బుర్ర శ్రవణ్ మాట్లాడుతూ 30 ఏండ్లు తన అన్న బుర్ర ఫిలిప్స్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని చెప్పారు. ఆయన సేవలను గుర్తుంచుకుని, తనపై నమ్మకముంచి, ఎస్సీ సెల్ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ హన్మకొండ డిస్ట్రిక్ట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ, 29వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ తోపాటు సోషల్ మీడియా అధ్యక్షులు సౌరం బాలు, జన్ను కర్ణాకర్, ఇసంపెల్లి ప్రవీణ్, రజిని, ప్రేమలత, ఎలీషా, సునీల్, బి.రాజు, జీ.రాజు, మహేష్, హరీష్, డి.విజయ్ కుమార్, ఎన్.వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.