- అధ్యక్షుడిగా వాజిద్, ఉపాధ్యక్షుడిగా వెంకన్న
వేద న్యూస్, హన్మకొండ:
తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్ఎస్) ఉద్యోగ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా వాజిద్ హుస్సేన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ లోని నేరళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో శనివారం టీఎస్ఎస్ ఉద్యోగ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా షేక్ వాజిద్ హుస్సేన్ జాఫర్, ఉపాధ్యక్షుడిగా పుల్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా వాంకుడోత్ రమేష్, కార్యదర్శిగా యోగానందం, కోశాధికారిగా కొండ సారంగపాణి, ప్రచార కార్యదర్శిగా బూడిద సురేందర్, మహిళా ప్రతినిధిగా ఎండీ రజియా, కార్యవర్గ సభ్యులుగా గడ్డం కళావతి, పుట్ట జానకి, అంబాల జయ, బొంకూరి రాణి, బొంకురి ప్రభాకర్లను ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో ముఖ్య సలహాదారుడు డా. వెన్నెల శ్రీనాథ్, మారేపల్లి జాన్, గౌరవ అధ్యక్షులు దార దేవేందర్, టీఎస్ఎస్ కళాకారులు పాల్గొన్నారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన వాజిద్ మాట్లాడుతూ సంఘం బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటివల 30 % పీఆర్సీ అమలుచేస్తూ పెరిగిన జీతం ఖాతాల్లో జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.