వేద న్యూస్, జమ్మికుంట: 

వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కాసర్ల కొమరయ్య, అధ్యక్షుడిగా కాసర్ల అనిల్, ఉపాధ్యక్షుడిగా దాట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా దాట్ల శ్రీనివాస్, కోశాధికారిగా దాట్ల మోహన్, జాయింట్ సెక్రెటరీగా కాసర్ల కుమార్ స్వామి, ప్రచారకర్తగా దాట్ల దుర్గాప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా రాజయ్య, రామయ్య, నాగరాజు, రవిని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేశామని తెలిపారు. అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు కులస్తులు, ఆ కుల పెద్దలు పాల్గొన్నారు.