వేద న్యూస్, వరంగల్:

వరంగల్ బార్దన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గత 42 ఏండ్ల నుండి అసోసియేషన్ వారు జెండా ఆవిష్కరణ చేస్తున్నారు.

కార్యక్రమంలో వరంగల్ బార్థన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు అంచురి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గజ్జల ఉపేందర్, ప్రధాన కార్యదర్శి దానం శ్రీనివాస్, సహాయక కార్యదర్శి పాల లక్మిపతి ,కోశాధికారి పరిమళ్ళ విజయ్, ఆర్గనైజర్ జంజీరాల మొగిలి, కార్యవర్గ సభ్యులు మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు.