వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
తన విద్యుక్త ధర్మాన్ని నిర్తర్తించి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడ సీఐ తుమ్మ గోపి అందరి అభినందనలు పొందారు. వివరాల్లోకెళితే..జనసంచారం లేని చోట ఒక వ్యక్తి రెండు రోజుల క్రితం నీటితో కూడిన 20 ఫీట్ల లోతులో పడిపోయాడు.
అటువైపుగా వెళ్లిన ఒక లారీ డ్రైవర్ నాలాలో వ్యక్తి ఉండటాన్ని చూసి డయల్ 100 కు కాల్ చేసి సమాచారమిచ్చారు. ఈ విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మట్వాడ సీఐ గోపికి సమాచారం ఇచ్చారు.
ఆయన వెంటనే అక్కడికి వచ్చి చాకచక్యంగా వ్యవహరించి ..అప్పటికప్పుడు రోప్ సహాయంతో తానే స్వయంగా ఆ లోతులోకి దిగి ఆ వ్యక్తిని నడుముకు కట్టుకుని అతని ప్రాణాన్ని కాపాడటం విధినిర్వహణలో పోలీస్ అంకితభావాన్ని తెలియపరుస్తున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ‘ఖాకీకి సెల్యూట్’ అంటూ నెటిజన్లు, నగరవాసులు కొనియాడుతున్నారు. రాష్ట్ర డీజీపీ , పోలీస్ ఉన్నతాధికారులు సీఐ గోపిని అభినందించారు.