– 10 వేల మందిని తరలించే దిశగా కృషి చేయాలని సూచన
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఈ నెల 15న హుస్నాబాద్ నియోజకవర్గకేంద్రంలో సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్న సంగతి అందరికీ విదితమే. ఆ సభకు బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి మండల ఇన్ చార్జి‌గా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎల్కతుర్తి మండలకేంద్రంలో వెంకన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగుర్ల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సభను సక్సెస్ చేయాలన్నారు. మండలం నుంచి 10 వేల మంది టార్గెట్ ఇచ్చినట్లు చెప్పారు.

10 వేల మందిని తరలించే దిశగా అందరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు. మండలానికి వచ్చిన వెంకన్నను బీఆర్ఎస్ నాయకులు పూలబొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హన్మకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, ఎంపీపీ మేకల స్వప్న, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మయ్య, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బూర్గుల రామారావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్ ఆరె కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, ఉపాధ్యక్షులు సుకినె సుధాకర్ రావు, అంబీరు శ్రీనివాస్, మండల అధ్యక్షులు కుడితాడి రాజు తదితరులు పాల్గొన్నారు.