•  పరిసరాల పరిశుభ్రతపై పంచాయతీ సెక్రెటరీ ఫోకస్

వేద న్యూస్, హన్మకొండ:
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఒగ్లాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం, మంచి నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, బావులలో క్లోరినేషన్ చేయడం వంటి పారిశుధ్య పనులను చేపట్టారు.

ఈ పారిశుధ్య పనులను పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సెక్రెటరీ పనులను పరిశీలించారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సీజనల్ డిసీజెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సెక్రెటరీ సూచించారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని తెలిపారు. ఇంకా రెండు, మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదు అని తెలిపారు.