• ఓబీసీ మోర్చా  కార్యవర్గ సభ్యుడు గోగికార్ అనిల్
  • జీడబ్ల్యూఎంసీ 26వ డివిజన్ లో బీజేపీ సభ్యత్వ సన్నాహక సమావేశం

వేద న్యూస్, వరంగల్:

రానున్నరోజుల్లో రాష్ట్రంలో బీజేపీ దే అధికారం అని, దానికోసం కార్యకర్తలు సిద్ధం అవ్వాలని ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు జి.అనిల్ అన్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీడివిజన్ స్థాయి సభ్యత్వ సన్నాహక సమావేశం భాగంగా వరంగల్ 26 వ డివిజన్ స్థాయిలో డివిజన్ అధ్యక్షుడు ఆకెన సాగర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి అనిల్ హాజరై మాట్లాడారు. 

బీజేపీలోకి ప్రతి బూత్ నుండి 200 మందిని చేర్పించే దిశగా కార్యకర్తలకు సిద్ధం చెయ్యాలని నాయకులకు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి పార్లమెంటు స్థానాలు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

సమావేశం లో బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు గడల కుమార్, జిల్లా మైనారిటీ మొర్చ గోవింద్ సింగ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సాంబరాజు కమలాకర్, జిల్లా కోశాధికారి కుచన క్రాంతి, బూత్ అధ్యక్షులు ప్రశాంత్ వనగల శ్రీనివాస్, ముత్తినేని లక్షమన్ ,చండిరెడ్డి నవీన్ కుమార్, రామ నాగార్జున, చింతం మహేందర్, ఆడేపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.