వేద న్యూస్, చెన్నూరు:
ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం ఉంటుందని చాలా మంది దాదాపుగా అనుకుంటుంటారు. కానీ, అది అపోహ మాత్రమేనని చేతల్లో నిరూపించారు చెన్నూరు పట్టణ సీఐ రవీందర్. ఖాకీలకు హృదయం, మానవత్వం ఉంటుందని తన చర్యల ద్వారా చెప్పకనే చెప్పేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల పరిధిలోని కిష్టంపేట గ్రామ సమీపంలోని మంచిర్యాలకు వెళ్లే ప్రధాన రహదారిపై శునకం విగతజీవిగా పడి ఉంది. ఆ కుక్కను రోడ్డుపైన వెళ్లే ఏదైనా వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్టు తెలుస్తోంది.
విధి నిర్వహణలో భాగంగా ఆ దారి గుండా వెళుతున్న చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్ ..కుక్క రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించి.. మానవతా దృక్పథంతో శునకం మృతదేహాన్ని రోడ్డుపై నుంచి తొలగించారు. రహదారిపై ప్రమాదాలు జరగకుండా సామాజిక బాధ్యతతో పలువురికి ప్రేరణ కలిగించిన సీఐని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.