- టిపిటిఎఫ్ మండల అధ్యక్షునిగా రామంచ బిక్షపతి
- టిపిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా కాలేశి కొమురయ్య
వేద న్యూస్, వరంగల్:
భీమదేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టి పి టి ఎఫ్ మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ మీటింగ్ లో టిపిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖకు నూతన కమిటీని ఎన్నుకున్నారు.
మండల శాఖ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రగిరి లక్ష్మయ్య, ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఉపాధ్యక్షులు ఇప్పకాయల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి చందుపట్ల రాజేంద్రం గార్లు వ్యవహరించారు.
ఈ సమావేశంలో నూతనంగా మండల శాఖకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన రామంచ బిక్షపతి, కాలేశి కొమురయ్యలు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తామని, టిపిటిఎఫ్ ప్రధాన ఆశయం అయిన కామన్ స్కూల్ విద్యా విధానం కోసం పోరాడుతామని తెలియజేశారు. ఎన్నికలకు సహకరించిన మండల,జిల్లా,రాష్ట్ర బాధ్యులకు ధన్యవాదాలు చెప్పారు.
టిపిటిఎఫ్ మండల అధ్యక్షుడు
: రామంచ బిక్షపతి, జడ్పిహెచ్ఎస్ ముల్కనూరు
ప్రధాన కార్యదర్శి: కాలేశి కొమురయ్య, పిఎస్ ముల్కనూరు
ఉపాధ్యక్షులు:
1. జి.రమణారెడ్డి, జడ్పిహెచ్ఎస్ మాణిక్యపూర్
2. వి ప్రియదర్శిని, పిఎస్ ముత్తారం
3. వొడ్నాల సదానంద్, పిఎస్ ధర్మారం
కార్యదర్శులు:
1. టి. విజయభాస్కర్, పిఎస్ కొత్తపల్లి
2. పి.బావు సింగ్, పిఎస్ గాంధీనగర్
3. పి.శారద,పిఎస్ బుడగ జంగం కాలనీ
జిల్లా కౌన్సిలర్లు
1. ఏనుగు శంకర్ రెడ్డి, పిఎస్ వంగర
2. ప్రతాప అనిల్, జెడ్పిహెచ్ఎస్ మాణిక్య పూర్
3. మండ శోభారాణి, పిఎస్ కొత్తకొండ
4. దొంతరవేణి లక్ష్మణ్, పిఎస్ బుడగ జంగాల కాలనీ
5. పూదరి రమేష్, జెడ్ పి హెచ్ ఎస్ కొత్తపల్లి