వేద న్యూస్, వరంగల్:
హన్మకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి మండలకేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం వీరనారి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రైతంగా పోరాట యోధురాలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వీరనారి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు.
తంగళ్ల పల్లి రమేష్, జంపాయ, గోలి రాజేశ్వరరావు, గొడిశాల యాదగిరి, లోకిని సూరయ్య, శీలం అనిల్ కుమార్, పాక రమేష్, శనిరపు వెంకటేష్ ,బండి కుమారస్వామి, సబ్బు సారయ్య, బండి కొమురయ్య, కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తంగళ్ళపల్లి రాజకుమార్ అంచనగిరి, నరసింహులు, అంచనగిరి రవి (సల్మాన్), తంగళ్ళపల్లి భద్రయ్య, కుమారస్వామి, ఐలయ్య, కుమారస్వామి, శ్రీను, తిరుపతి అంచనగిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.