వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో పారిజాత కంపెనీ వారి ఆధ్వర్యంలో పురుగు మందుల వాడకంపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రస్తుతం మిరప తోటలు నాటుతున్నారని ఇప్పటినుండే సరైన యాజమాన్య పద్ధతులతో మంచి దిగుబడిని పొందవచ్చునని,పత్తి,వరి పంటలలో తెగుళ్ళ నివారణకు పారిజాత కంపెనీలో సరికొత్త టెక్నాలజీతో రైతులకు తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని కంపెనీ తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి ప్రసన్నకుమార్ తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో కంపెనీ కరీంనగర్ జిల్లా టీం లీడర్ రాజేష్, స్థానిక డీలర్ మందోటి రాజు,కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.