వేద న్యూస్, ఎలిగేడు:
ఎలిగేడు మండలంలో గురువారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు బుధవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లో వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి పర్యటించనున్నారు , ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలితాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేయనున్నారు. కార్యక్రమానికి మండలవ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని మండల బీఆర్ఎస్ నాయకులు కోరారు.