వేద న్యూస్, వరంగల్:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన గంగిశెట్టి రంజిత్ కుమార్‌కు మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ జవహార్ లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. దిగువ మధ్య తరగతి చిరు వ్యాపారి కుటుంబానికి చెందిన రంజిత్ కుమార్..”నువ్వులలో జన్యుపరమైన అంచనా” అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు.

మట్టిలో మాణిక్యం రంజిత్
గంగిశెట్టి స్వరూపరాణి – రవీందర్..దంపతుల మూడో సంతానం రంజిత్ కుమార్.. చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణిస్తున్నారు. పిల్లల చదువు నిమిత్తం తల్లిదండ్రులు మొగుళ్లపల్లి నుంచి జమ్మికుంట పట్టణానికి తమ నివాసాన్ని మార్చుకున్నారు.

తల్లిదండ్రుల కష్టాన్ని చిన్ననాటి నుంచి గమనించిన రంజిత్.. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తాజాగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. తమ కుమారుడు డాక్టరేట్ సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

మొగుళ్లపల్లి, జమ్మికుంట లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన రంజిత్.. ఇంటర్..వరంగల్ లో, డిగ్రీ.. హైదారాబాద్ లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ, పీజీ..పశ్చిమ బెంగాల్ లోని విశ్వభారతి విశ్వ విద్యాలయంలో కంప్లీట్ చేశారు. పీ హెచ్ డీ ని..జవహార్ లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయంలో..
‘డార్క్ బ్రౌన్ సెసామె జెనెటిక్ అసెస్‌మెం ‌ట్’ అనే అంశంపై ప్రొఫెసర్ రజని బిసెన్ మార్గదర్శనంలో రంజిత్ కుమార్ తన రీసెర్చ్ కొనసాగించారు.

ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో జవహార్ లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్(వీసీ) ప్రొఫెసర్ పీ కే మిశ్రా డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ ను తోటి స్నేహితులు, విద్యార్థులు, బంధు మిత్రులు, మొగుళ్లపల్లి గ్రామస్తులు, జమ్మికుంట పట్టణవాసులు అభినందిస్తున్నారు.

డాక్టరేట్ పట్టా పొందిన ఉన్నత విద్యావంతుడైన రంజిత్ భవిష్యత్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.