వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కాబోతున్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అధికార గులాబీ పార్టీలో జోష్ నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన పూర్తి అయిన క్రమంలో ఈ నెల 15న సీఎం కేసీఆర్ సభ కూడా జరగనుంది. ఈ క్రమంలోనే పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దూసుకుపోతున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
ఎలిగేడు మండలంలో నేడు(గురువారం) ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మండలవ్యాప్తంగా భారీ చేరికలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గులాబీ పార్టీలోకి లాలపల్లి గ్రామం నుంచి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే దాసరి సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఎలిగేడు మండలం కంచుకోట మారబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.