వేద న్యూస్, మరిపెడ:

నాబార్డు సహకారంతో స్పందన సర్వీసెస్ సొసైటీ ద్వారా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం, తొర్రూరు, మరిపెడ మండలంలో ఉన్న ప్రతాపరుద్ర, శ్రేయోభిలాషి, ఆకేరు సమృద్ధి రైతు ఉత్పత్తిదారుల సంఘాలలోని డైరెక్టర్లను, మెంబర్లను ఎక్స్ పోజర్ విజిట్ లో భాగంగా ముల్కనూరు సొసైటీ అంకాపూర్,ఇంద్రవెల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘాలను చూడడానికి తీసుకెళ్లారు.

బుధవారం ఈ కార్యక్రమాన్ని నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, స్పందన సర్వీసెస్ కార్యదర్శి చొప్పరి సోమయ్య గారె జెండా ఊపి ప్రారంభించారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునిక రంగంలో రంగాలలో మన వ్యవసాయాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. రు చూడబోయే ప్రదేశాలలో మంచిని తెలుసుకొని గ్రామాలలో అనుసరించి విధంగా నేర్చుకొని రావాలని కోరారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.