• మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్ 

వేద న్యూస్, వరంగల్:

రాష్ట్రంలో చేపడుతున్న బీసీ కులగణను వ్యతిరేకించడం సిగ్గుమాలిన చర్య అని నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం  నెక్కొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా పెంచేందుకు బీసీ కులగలను చేపడుతుంటే హర్షించేది బోయి విమర్శించడం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు.

బీసీ లకు రిజర్వేషన్ లను పెంచడానికి బిఆర్ఎస్ పార్టీ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రమిస్తే అప్పుల కుప్పగా చేసిన బిఆర్ఎస్ పార్టీ నేడు ఆ అప్పుల మిత్తి కట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుందన్నారు. రాష్ట్రం రాకముందు చెప్పులు లేని బిఆర్ఎస్ నాయకులు కోట్లకు ఎలా పరిగెత్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

అక్రమంగా సంపాదించక పోతే భయం ఎందుకని డిమాండ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమంలో నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, ఓబిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగం ప్రశాంత్, మండల కాంగ్రెస్ నాయకులు కెవి సుబ్బారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి జమ్ముల సోమయ్య, బొమ్మర బోయిన రమేష్ మాజీ వార్డ్ మెంబర్ పోలిశెట్టి భాను తదితరులు పాల్గొన్నారు.