- భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నేతలు
వేద న్యూస్, వరంగల్:
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డిని మంగళవారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
నేతలిరువురు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భద్రకాళి ఆలయ ప్రాంగణంలో రాకేష్ రెడ్డికి నరేష్ మొక్కను బహూకరించారు. యువనేత నరేష్ ను రాకేష్ రెడ్డి అభినందించారు.
రాష్ట్రంలో రాబోయేది గులాబీ పార్టీ కాలమేనని స్పష్టం చేశారు. కేటీఆర్, కెసిఆర్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.