వేద న్యూస్, ఓరుగల్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తున్నారని హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ తెలిపారు.
హౌస్ లిస్టింగ్ లో గ్రామంలోని అన్ని కుటుంబాలు ఎంట్రీ అయ్యేలా చూసుకుంటూ ఒక పక్క ఎన్యుమరేటర్లుగా విధులు నిర్వర్తిస్తూ,ఇతర ఎన్యూమరేటర్లకు గ్రామ పరిస్థితి పై సమగ్ర
సమాచారాన్ని అందిస్తూ సర్వే ను విజయవంతం చేయటకు పంచాయతీ కార్యదర్శులు సహకారం అందిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో సెక్రెటరీలు తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.