వేద న్యూస్, ఓరుగల్లు:

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. శుక్రవారం శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి ముస్కు  కృష్ణ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.

ఈసందర్భంగా కేక్ కోసి, మిఠాయిలు పంచి సంబురాలు చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో టీపీసీసీ చీఫ్ గా నాడు రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని  ఈ సందర్భంగా నేతలు వెల్లడించారు. హస్తం పార్టీలో నూతనోత్తేజం నింపిన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అని కొనియాడారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు అని వెల్లడించారు. కార్యక్రమంలో రాజేందర్, నాగరాజు, శ్రీకాంత్, కమలాకర్, కృష్ణ, లక్ష్మణరావు, వంశీ, అంజద్ పాషా తదితరులు పాల్గొన్నారు.