వేద న్యూస్, వరంగల్:

 హనుమకొండ జిల్లా దామెర మండలకేంద్రంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దురిషెట్టి భిక్షపతి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్దిస్తున్నట్లు తెలిపారు. ప్రజల గుండెల్లో వారు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. 

రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న అన్ని కార్యక్రమాలను అమలు పరుస్తూ, అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకొచ్చిన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో శీను, శంకర్, రవీందర్, శ్రీధర్, హరికృష్ణ, రవి, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.