– బీజేపీ యువనేతగా ప్రజలకు సుపరిచితులు
– పార్టీ సిద్ధాంతం కోసం పని చేసే నేతగా గుర్తింపు
– నరేశ్ పటేల్‌కు టికెట్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం
వేద న్యూస్, వరంగల్:
పూటకో పార్టీ మార్చే నాయకులున్న ప్రస్తుత తరుణంలో..స్వార్థపూరిత ప్రయోజనాలు పక్కనబెట్టి..పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తోన్న యువనాయకుడిని అసెంబ్లీ బరిలో దించేందుకు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సదరు యువకుడు సైతం పోటీకి సిద్ధంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆ యువకుడే సిద్ధం నరేశ్ పటేల్. బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులుగా పని చేస్తోన్న నరేశ్..తన తోడబుట్టిన అన్న అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా..తాను నమ్మిన పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తున్నారు. జనం పక్షాన నిలబడి కొట్లాడుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయమే ధ్యేయంగా తాను రాజకీయ అడుగులు వేస్తున్నట్లు నరేశ్ పేర్కొంటున్నారు.
యూత్‌లో చక్కటి పాలోయింగ్
బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్న సిద్ధం నరేశ్ పటేల్ కు యూత్ లో చక్కటి పాలోయింగ్ ఉండటంతో పాటు ఆయన సామాజిక వర్గం తూర్పు నియోజకవర్గ బరిలో ఉండటానికి కలిసొచ్చే అంశాలు. వచ్చే ఎన్నికల్లో యువనాయకుడు సిద్ధం నరేశ్ పటేల్ ను తూర్పు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపితే యువత, ప్రజలు ఆలోచన చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
పార్టీ పరంగా కానీ యువత పరంగా కానీ సేవా కార్యక్రమాల పరంగా కానీ క్లీన్ ఇమేజ్ ఉన్న సిద్ధం నరేశ్ కు అవకాశమిస్తే ప్రజలు పట్టం కట్టే అవకాశాలుంటాయని ఆయన అనుచరులు అంటున్నారు. నరేశ్ తరఫున ప్రచారానికి యువత సైతం ‘సిద్ధం’గా ఉంటోందనే వాదనలు వినబడుతున్నాయి.
సేవాగుణంలో నరేశ్‌కు సరిలేరు ఎవ్వరు
సిద్ధం నరేశ్ పటేల్..పార్టీ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించే కార్యకర్త మాత్రమే కాదు సైనికుడు కూడా అని చెప్పొచ్చు. ఎదుటి వారికి ఆపదొస్తే ‘నేనున్నాను’ అనే భరోసా కల్పించడంతో పాటు తోచినంత సాయం చేసే మంచి మనసు కలవాడు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటూ..వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దానికి తోడు ఆర్థికంగా కూడా భరోసా కల్పిస్తు్న్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితులలో ఎంతో మందికి అండగా నిలిచారు. నిత్యావసరాలను ఇంటి వద్దకే తీసుకెళ్లి అందజేశారు.
పార్టీకి నమ్మిన బంటు
బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఏ కార్యక్రమాన్నైనా సక్సెస్ చేయండలో తన వంతు పాత్రను సిద్ధం నరేశ్ పటేల్ హండ్రెడ్ పర్సెంట్ పోషిస్తుంటారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. పార్టీకి కంకణబద్ధులై పని చేస్తోన్న సిద్ధం నరేశ్ పటేల్ కు ఈ సారి అవకాశమిస్తే తప్పనిసరిగా గెలుపు జెండా ఎగురుతుందని సిద్ధం నరేశ్ పటేల్ వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గ ఆ పార్టీ, రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. దుబ్బాక, హుజురాబాద్, నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు సిద్ధం నరేశ్ ఆయా నియోజకవర్గాల్లో పని చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధం నరేశ్ పనితీరుపై బీజేపీ అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్లు వినికిడి. ఈ క్రమంలోనే నరేశ్ ను తూర్పు బరిలో దించే విషయమై పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు
ఏ సమస్య అయినా తన దృష్టికి వస్తే చాలు..పరిష్కార మార్గానికి నరేశ్ పటేల్ వెంటనే పోరాటమే దారిగా ముందుకెళ్తుంటారు. నిరుద్యోగుల సమస్యల విషయమై ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రసర్కార్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. షూ పాలిష్ చేసి వినూత్నంగా నిరసనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తోండగా, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని గాలికొదిలేసిందని సిద్ధం నరేశ్ పటేల్ విమర్శిస్తున్నారు. నిరుద్యోగుల సమస్యలను రాష్ట్రసర్కార్ దృష్టికి తీసుకెళ్లేందుకు వరంగల్ చౌరస్తా నుంచి హన్మకొండ చౌరస్తా వరకు నరేశ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ సీట్ల భర్తీ విషయమై సిద్ధం ఆధ్వర్యంలో బీజేపీ నేతలు కేఎంసీని ముట్టడించారు. మొత్తంగా సమస్యల పరిష్కారానికి తన వంతుగా పోరాటం చేసే నాయకుడిగా సిద్ధం నరేశ్ పటేల్ కు పార్టీలో గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు తూర్పు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయమై నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.