•   ఎమ్మెల్యే దాసరి సమక్షంలో నేతల చేరిక

వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల బీఆర్ఎస్ పార్టీలో జోష్ కనబడుతోంది. మండలంలోని లాలపల్లి గ్రామం గురువారం గులాబీమమైంది. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లాలపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి..సర్కార్ పథకాలను వివరించారు. త్వరలో లాలపల్లిలో రెడ్డి కమ్యూనిటీ హాల్, శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి ధూప దీప నైవేద్యం ప్రభుత్వం తరఫున వచ్చే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు.

నాయకులకు కండువా కప్పిన మనోహర్ రెడ్డి

ప్రచార కార్యక్రమంలో మండలవ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, లాలపల్లి గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి, కోమటిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయకులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పిటిసి మండిగ రేణుక రాజనర్సు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మైపాల్ రెడ్డి, రాజేశం తదితరులు పాల్గొన్నారు.