• స్పందన సొసైటీ ఆధ్వర్యంలో ఆకెరు రైతు కంపెనీ ఉత్పత్తిదారుల కంపెనీ సర్వసభ్య సమావేశం

వేద న్యూస్, మరిపెడ:

మరిపెడ లో స్పందన సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో నడుస్తున్న ఆకేరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సర్వసభ్య సమావేశం స్పందన సొసైటీ కార్యాదర్శి చొప్పరి సోమయ్య సమక్షంలో మంగళవారం నిర్వహించారు. ఈ మీటింగ్ కు  ఉమ్మడి వరంగల్ జిల్లా నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్ ముఖ్య అతిధిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

రైతుకంపెనీ లో ఉన్న రైతులు ఏ కార్యక్రమం చేపట్టినా సమష్టి నిర్ణయాలతో కంపెనీని ముందుకు నడిపించాలని, కంపెనీలో ఎక్కువమంది రైతులను భాగస్వాములను చేసి వాటాధనం ఎక్కువ మొత్తంలో జమ చేసుకోవాలని సూచించారు. డైరెక్టర్స్ ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి విషయం పారదర్శకంగా, రాత పూర్వకంగా ఉండాలని సూచించారు. 

కంపెనీలో ఉన్న రైతులను నూతన వ్యవసాయపద్దతులు పాటించేవిధంగా శిక్షణలు ఇప్పించాలని, అందుకు వ్యవసాయ ఉద్యానవనశాఖ ఇతర ప్రభుత్వ శాఖల సహకారం తీసుకోవాలని పిలుపునిచ్చారు.  కంపెనీలో ఉన్న సన్నకారు రైతులకు కూరగాయలసాగుకు నాబార్డ్ నుండి సహకారం అందిస్తామని, అలాంటి వారిని గుర్తించాలన్నారు.

అదేవిధంగా చేపలపెంపకం దారుకులకు చేపల పెంపకంపై శిక్షణలు మరియు క్షేత్ర సందర్శనకు సహాకరిస్తామని తెలిపారు.  కంపెనీ లో వాటాధనం 500 మంది రైతులు చేరి.. 5 లక్షలు వాటాధనం జమచేసుకుంటే నాబార్డ్ నుండి రూ. 5 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ గా సహకారం అందిస్తామని, దీనితో కంపెనీ వ్యాపారభివృద్ది చేసుకోవచ్చని సూచించారు.

వ్యాపారం అభివృద్ధి చెందితే టర్నోవర్ నుబట్టి బ్యాంకు లనుండి కూడా రుణాలు పొంది వ్యాపారాభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు .రైతుకంపెనీ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు మంచి కంపెనీల నుండి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అందించి.. రైతు పండించే పంటలు అధిక దిగుబడి రావడానికి దోహద పడాలని , అందుకు కంపెనీ అభివృద్ధి లోడైరెక్టర్ల పాత్రకీలకమని తెలిపారు.

అనంతరం కంపెనీ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ షాప్ ప్రారంభించారు. మరిపెడ ఏడీఏ వి.విజయ్ చంద్ర మాట్లాడుతూ కంపెనీ లో ఉన్న రైతులకు వ్యవసాయశాఖ నుండి అవసరమైన సేవలు అందిస్తామని, కంపెనీ చేసే వ్యాపారం చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని సూచించారు. మంచి నాణ్యమైన ఎరువులు పురుగుమందులు మరియు విత్తనాలు అందించాలని తెలిపారు. 

కార్యక్రమంలో మరిపెడ వ్యవసాయ అధికారి వీరాసింగ్, కంపెనీ ఏర్పాటు చేసినప్రగతి సేవాసమితి సెక్రెటరీ గద్దల జాన్, స్ఫూర్తి ఎడ్యుకేషనల్ అండ్  రూరల్ డెవలప్ మెం ట్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణయ్య, ఆకెరు రైతు కంపెనీ సీఈవో ఎడెల్లి పరశురాములు కొండూరు వెంకన్న కంపెనీ డైరెక్టర్స్ బావుసింగ్, వీరబాబు, బిక్కు,వీరు,పర్థ్య, కంపెనీ సభ్యరైతులు తదితరులు పాల్గొన్నారు.