వేద న్యూస్, వరంగల్:
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అరెస్టు అప్రజాస్వామికమమని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి హరీశ్, యువ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాడిల అక్రమ అరెస్టును ఖండించారు. యువ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని పరామర్శించడానికి వెళ్లిన హరీశ్ రావు ను అరెస్టు చేయడం సరికాదన్నారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఫొన్ ట్యాప్ చెయడం దురదుష్టకరం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ పాలన చేతగాక ప్రతిపక్ష నాయకులపైన అక్రమ కేసులు పెట్టించి అరెస్టు చెయడం అప్రజాస్వామికమమన్నారు.
అరెస్టులకు, బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీలు అమలయ్యేంత వరకూ వెంటపడుతూనే ఉంటామని వెల్లడించారు.