వేద న్యూస్, వరంగల్:
ఇతర శాఖల విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ సెక్రెటరీలకు ఆ బాధ్యతల నుంచి మినహాయింపులతో పాటు కొన్ని రక్షణలు కల్పించి తమ సమస్యలు పరిష్కరించాలని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కోరారు. ఈ విషయమై వారు ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు.
జాబ్ చార్ట్ ప్రకారం నిర్వహించవలసిన ప్రాథమిక విధుల కాకుండా ఇతర శాఖల పనులు, సర్వేలు అప్పగించే క్రమంలో వాట్సాప్ మెసేజ్ లు, జూంల ద్వారా కాకుండా సర్క్యులర్ ల ద్వారా మాత్రమే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆదివారాలు, పండుగ రోజులలో సెలవులు ఇవ్వాలని, ఒత్తిడి చేయరాదని అభ్యర్థించారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయని, సెక్రెటరీలకు సర్వేచేయుటకు తగు సమయం ఇవ్వాలన్నారు. ప్రమోషన్లు, కేడర్ స్ట్రెంత్, జేపీఎస్ లకు 2 సంవత్సరాల సర్వీస్ కలపడం, ఓపీఎస్ లను జేపీఎస్ లుగా మార్చడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ సెక్రెటరీలు కోరారు.