వేద న్యూస్, హైదరాబాద్ బ్యూరో:

హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై మంగళవారం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో మంగళవారం బాధితుడు కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ బంధన్  ఆస్పత్రిపై గత 20 రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నట్టు తెలిపారు.  హన్మకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య, ఐఎంఎ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రెసిడెంట్లకు ఇప్పటికే కంప్లయింట్ చేశానని, ఇప్పుడు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.

తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే సంబంధిత అధికారులు కాసులకు కక్కుర్తి పడకుండా నిజాయితీగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. బంధన్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ సమయంలో, పోస్ట్ ఆఫ్ కేర్‌లో డాక్టర్లు వహించిన నిర్లక్ష్యం వల్ల తాను ప్రాణాపాయస్థితికి చేరుకున్నానని వివరించారు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను బాధితుడు జర్నలిస్టు కృష్ణ కోరుతున్నారు.