వేద న్యూస్, వరంగల్:

సీఎం కప్ టోర్నమెంట్స్ లో భాగంగా మంగళవారం హన్మకొండ జిల్లా  దామెర మండలంలో క్రీడోత్సవాలు ప్రారంభించారు. క్రీడల్లో వాలీబాల్, ఖోఖో  కబడ్డీ లాంటి క్రీడలను మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులతో పోటీలు నిర్వహించారు. 

ఈ క్రీడలను మండల స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ ఆర్. బాలరాజు ప్రారంభించినారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, మెంబర్స్ తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంఈవో రాజేష్ కుమార్, ఎంపీవో రంగాచారి , పీడీ గారలు దేవేందర్, లక్ష్మీ నారాయణ, రాజేశ్వర్ మండల ఇన్ చార్జి రమేష్, పంచాయతీ కార్యదర్శులు మనోహర్,నరేష్ ,సరళ పాల్గొన్నారు.