వేద న్యూస్, డెస్క్:
ఈనెల 14 న రెబ్బెన మండలం ఇందిరా నగర్ గ్రామపంచాయతీలో కనక దుర్గాదేవి స్వయంభూ మహంకాళీ అమ్మవారి ఆలయ అర్చకులు దేవర వినోద్ ఆధ్వర్యంలో గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం, కీర్తి డెంటల్ ఆసుపత్రి కాగజ్ నగర్ ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు వినోద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రజలు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కోరారు. కంటి, దంత వైద్య శిబిరంలో ఉచిత ఆపరేషన్లు చేసి మందులు, అద్దాలు ఇవ్వనున్నట్టు వివరించారు. ఈ వైద్య శిబిరం ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.