వేద న్యూస్, ఎల్కతుర్తి:
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (జేఎస్ఆర్) గురువారం ఆయన స్వగ్రామం కన్నారంలో ఎల్కతుర్తి మండల బీజేపీ నేతలతో సమావేశమయ్యారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీజేపీ ఎల్కతుర్తి మండల నాయకులు, కార్యకర్తలు, మండల కమిటీ బాధ్యులు, అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ చార్జిలు పాల్గొన్నారు. వారందరికీ జేఎస్ఆర్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.