వేద న్యూస్, వరంగల్:

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని  నల్లబెల్లి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామానికి చెందిన ఎడ్డె శంకర్ రావు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రైతు రక్షణ సమితి ( టీఆర్ఆర్ఎస్) హన్మకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ శుక్రవారం ఆ గ్రామానికి నాయకులతో కలిసి వెళ్లారు. శంకర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనోధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మనోహర్, శ్రీకాంత్, మనోహర్ రావు రవీందర్, రాజు, శ్రీధర్, వెంకటేశ్, రమేష్ , శ్రవణ్, భాను తదితరులు పాల్గొన్నారు.