- ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన పోలీసులు
వేద న్యూస్, వరంగల్ :
వేద న్యూస్’ తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మిల్స్ కాలనీ పోలీస్ వెంకటరత్నం, ఎస్సై సురేష్ లు ఆదివారం వరంగల్ ఏసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా సమాజానికి మేలు చేసే విధంగా వార్త పత్రికలు, మీడియా పని చేయాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక పని చేయాలన్నారు. ఈ సందర్భంగా యజమాన్యానికి, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.