- జాతర పరిసరాల్లో పరిశుభ్ర వాతావరణము ఉండేలా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న అధికారులు
వేద న్యూస్, వరంగల్:
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామీ జాతర లో భక్తుల సౌకర్యార్థం పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ జాతరలో పారిశుధ్య పనులను హనుమకొండ జిల్లాలోని వివిధ మండలాలతో పాటు దామెర మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు, కారొబార్లు ,గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్నారు.
సర్వాంగ సుందరంగా జాతర పరిసరాలు
ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ,రోడ్లను శుభ్రం చేస్తూ, బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుతున్నారు. భక్తులకు కోర్కెలు తీర్చే శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సిబ్బంది 24/7 కృషి చేస్తున్నారు.
జాతర ఏర్పాట్లనుజిల్లా పంచాయతీ అధికారి లక్మి రమాకాంత్,డివిజనల్ పంచాయతీ అధికారి గంగా భవాని, మండల పంచాయతీ అధికారి రఘుపతి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.