వేద న్యూస్, శాయంపేట:

శాయంపేట మండలంలో రైజింగ్ స్టార్ యూత్ ఆద్వర్యం లో మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. నిర్వహించిన క్రికెట్ పోటీలో సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రథమ విజేతగా నిలిచిన శాయంపేట కు రూ.8016 ద్వితీయ బహుమతి గెలుచుకున్న పత్తిపాకకు రూ.6016 అందించి శాయంపేట మాజీ ఎంపీటీసీ దైనంపెల్లి జమున సుమన్, మైలారం మాజీ ఎంపీటీసీ గడిపే విజయ్ కుమార్ విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మాజీ ఎంపీటీసీ జమున సుమన్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని క్రీడ స్ఫూర్తి తో స్నేహ పూరిత వాతావరణం లో ఉండాలని అన్నారు. గ్రామ ప్రజలకు, క్రీడాకారులకు బోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు రైజింగ్ స్టార్ యూత్ నాయకులు నాగుల కళ్యాణ్, మురహరి సూర్య, బాసని అఖిల్, బాల్నే నాగరాజు, కుతాటి రిణాకర్ పాల్గొన్నారు.