• రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపికకు..

వేద న్యూస్, వరంగల్:

ప్రభుత్వం ఈ నెల 26 నుండి 4 పథకాలు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు ల మంజూరు, ఇందిరమ్మ ఇండ్లు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..అమలు చేయనున్నది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల విషయమై అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు.

హన్మకొండ జిల్లా దామెర మండలకేంద్రంలో స్పెషల్ ఆఫీసర్ కేవీ రంగాచారి ఆధ్వర్యంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల కు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేశారు. కార్యక్రమంలో ఆర్.ఐ.సంపత్,పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, ఏ. ఈ. వో. జగదీశ్వర్ , ఫీల్డ్ అసిస్టెంట్ సారంగం, కారోబార్ బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.