వేద న్యూస్ శాయంపేట:

శాయంపేట మండలం నుండి మానుకోటకు ఉద్యమ కారులు జైత్రయాత్రకు బయలుదేరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ పొడి శెట్టి గణేష్ ,మండలాధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్ మాట్లాడుతూ మానుకోటలోజరుగు తెలంగాణ ఉద్యమకారుల జైత్రయాత్ర కు ఉద్యమకారుల హక్కుల సాధనకై జయప్రదం చేయాలనితెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీలు 250 చదరపు గజాల స్థలంతో పాటు 25 వేల పెన్షన్ ఇవ్వాలని ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఫోరం గౌరవ అధ్యక్షులు పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి ,బలిజ నరసింహా రాములు ,మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాసరెడ్డి ,గంట శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గిద్ద మరి సురేష్ ,పల్లె బోయిన సారయ్య, కొప్పుల మాజీ ఎంపిటిసి మేకల శ్రీనివాస్, రామన్న ,నరహరిశెట్టి రామకృష్ణ ,మామునూరు రాజయ్య ,ఆరేపల్లి మాజీ సర్పంచ్ దుంపల మహేందర్ రెడ్డి, అడప ప్రభాకర్ ,రంగు మహేందర్, జోగి రెడ్డి ,ఎండి రఫీ ,వనం దేవరాజు ,ముంజాల నాగరాజు, కానుగుల నాగరాజు ,మారేపల్లి సదానందం, కొడపాక బాబు, తుమ్మ ప్రభాకర్ ,నమిత బాజీ అశోక్ ,రఫీ ,శంకర్ రెడ్డి ,బాసాని నవీన్ ,బాసాని సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.