వేద న్యూస్, వరంగల్ :
స్నేహశీలి, మృదుస్వభావి, ప్రేమమూర్తి, సేవాతత్పరులు, గణిత అధ్యాపకులు నేరేడుపల్లి గ్రామ వాసి, “నూనె రవీందర్ ” సంస్మరణ సమావేశం వరంగల్ లోని ఐఎంఏ మెడికల్ హాల్లో ఏర్పాటు చేసిన నేరేడుపల్లి గ్రామ బాల్య మిత్రులు. ఎస్.ఎస్.సి 1991 బ్యాచ్ మిత్రులు, నేరేడుపల్లి గ్రామ పెద్దలు అందరూ పాల్గొని రవీందర్ తో తమకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్ మాట్లాడుతూ, తన ఎస్ఎస్ సి క్లాస్మేట్ రవీందర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయాను అని, తనవంతు సహాయంగా రవీందర్ కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. రవీందర్ గణితశాస్త్ర అధ్యాపకులు అయినప్పటికీ ఆర్ధికంగా వెనుకబడి పోయినందున, వారి కూతుర్లు నీట్ ప్రిపేర్ అవుతున్నారని తెలుసుకొని, వారి విద్యాభ్యాసం కోసం అయ్యే ఖర్చు కూడా ఎస్.ఎస్.సి క్లాసుమేట్లు చేస్తారని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయుటకు నిర్ణయం తీసుకున్నారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్ కుటుంబ సభ్యులు, ఎస్.ఎస్.సి 1991 బ్యాచ్ మిత్రులు వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, పల్లె నాగేశ్వర్ రావు, ముక్క వేణు, కందికొండ రాజేందర్, గాజర్ల రాజు, కూరాకుల సూరయ్య, రేణుకుంట్ల సురేష్, నారాయణస్వామి, రవి, ఎన్.రవి, రమణ రెడ్డి, గాజర్ల సదయ్య, గందే రాజేష్, రాజు, కర్రు ఓంకార్, శ్రీనివాస్, రాజమౌళి, ప్రభాకర్, కమలాకర్, చంద్రమౌళి, రఘుపతి, రాజేష్, జనుగాని నారాయణ, సతీష్, మదు, మోహన్ రావు, సురేందర్, మరియు రవీందర్ శిష్యులు, స్నేహితులు, తోటి ఉపాధ్యాయులు, నేరేడుపల్లి గ్రామం నుండి ముక్కా రామన్న, మోహన్, శ్రీనివాస్, తిరుపతి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.